Monday, 16 March 2026
  • Home  
  • చిన్న బాబు సేవలను గుర్తించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రశంస అవార్డుతో సత్కరించిన ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి
- తిరుపతి

చిన్న బాబు సేవలను గుర్తించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రశంస అవార్డుతో సత్కరించిన ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి

పేద ప్రజల ఆరోగ్య సేవలో చినబాబు.. పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుంటూ….. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ ఎన్. మురళీమోహన్ నాయుడు ( చిన్న బాబు ) సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ గుర్తించి ప్రశంస అవార్డును ప్రకటించింది.. శనివారం హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా ఎన్. మురళీమోహన్ నాయుడు( చిన్న బాబు)కు ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, నగిరి, జీడీ నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలలోని పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ చిన్న బాబు విశేష సేవలు అందించారు. 2017లో తిరుపతి రుయా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా , రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న విద్యా, వైద్య,రక్తదాన శిబిరాలు, విపత్తుల సాయం వంటి కార్యక్రమాలలో పాల్గొని ఎన్ చిన్నబాబు అందించిన సేవలు అమోఘమని ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి అభినందించారు.. ఉత్తమ సేవ ప్రశంస అవార్డు గ్రహీత ఎన్ చిన్నబాబు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు యువతకు చైతన్య మూర్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు, ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు ప్రేరేపితుడైన చినబాబు తిరుపతి ప్రాంతంలో పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలు ప్రాణాలను కాపాడడానికి తోడ్పాటును అందించానన్నారు. శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. చినబాబుకు ఎన్టీఆర్ ట్రస్ట్ అరుదైన అవార్డు అందించడంతో పలువురు ఆయనకి అభినందనలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో ట్రష్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్, చీఫ్ ఆపరేషన్ అధికారి గోపి, తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ రవికుమార్, దినేష్, నూతలపాటి చంద్రబాబు, జయప్రకాష్, భాను, మురళి తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల ఆరోగ్య సేవలో చినబాబు..

పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం మండలం

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుంటూ….. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ ఎన్. మురళీమోహన్ నాయుడు ( చిన్న బాబు ) సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ గుర్తించి ప్రశంస అవార్డును ప్రకటించింది.. శనివారం హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా ఎన్. మురళీమోహన్ నాయుడు( చిన్న బాబు)కు ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, నగిరి, జీడీ నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలలోని పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ చిన్న బాబు విశేష సేవలు అందించారు. 2017లో తిరుపతి రుయా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా , రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న విద్యా, వైద్య,రక్తదాన శిబిరాలు, విపత్తుల సాయం వంటి కార్యక్రమాలలో పాల్గొని ఎన్ చిన్నబాబు అందించిన సేవలు అమోఘమని ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి అభినందించారు.. ఉత్తమ సేవ ప్రశంస అవార్డు గ్రహీత ఎన్ చిన్నబాబు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు యువతకు చైతన్య మూర్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు, ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు ప్రేరేపితుడైన చినబాబు తిరుపతి ప్రాంతంలో పలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలు ప్రాణాలను కాపాడడానికి తోడ్పాటును అందించానన్నారు. శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. చినబాబుకు ఎన్టీఆర్ ట్రస్ట్ అరుదైన అవార్డు అందించడంతో పలువురు ఆయనకి అభినందనలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో ట్రష్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్, చీఫ్ ఆపరేషన్ అధికారి గోపి, తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ రవికుమార్, దినేష్, నూతలపాటి చంద్రబాబు, జయప్రకాష్, భాను, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.