చిట్వేల్ మండల పరిధిలో నూతనంగా ముగ్గురు కానిస్టేబుళ్లుగా ఎంపికైన యువకులను చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్వేల్ ఎస్సై వినోద్ కుమార్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి తిరుపతిలోని కళ్యాణ్ డ్యాంలో పోలీస్ శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్సై తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో, జాగ్రత్తగా పూర్తి చేసి ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని సూచించారు. చట్ట పరిరక్షణలో భాగస్వాములై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని, నూతన కానిస్టేబుళ్లకు విజయవంతమైన సేవా జీవితాన్ని కోరారు.

చిట్వేల్‌లో నూతన కానిస్టేబుళ్లకు ఘన సన్మానం