చిట్వేలు పట్టణంలో కొన్ని దుకాణదారులు రెండు నెలల క్రితమే గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను నిర్లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులు లేబుల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చల్లటి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో శీతల పానీయాల వినియోగమే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటిది గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్‌ను సేవిస్తే జీర్ణ సమస్యలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌తో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీటిని తీసుకోవడం మరింత ప్రమాదకరమని తెలిపారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే దుకాణాలపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వినియోగదారులు కూడా కొనుగోలు ముందు ఎక్స్‌పైరీ తేదీని తప్పనిసరిగా పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిట్వేల్లో గడువు ముగిసిన కూల్‌డ్రింక్స్ విక్రయం – ఆరోగ్యానికి ముప్పు