చిట్వేల్, సెప్టెంబర్ 30 (మీ స్పందన)
చిట్వేలి ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బస్టాండులో కంట్రోలర్ ప్రత్యేకంగా బుక్కు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరు ఎక్స్ప్రెస్ సహా అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండులోకి ప్రవేశించి, కంట్రోలర్ దగ్గర సంతకాలు చేసి తిరిగి ప్రయాణం కొనసాగిస్తున్నాయి.బస్టాండు కాంపౌండ్ అంతా శుభ్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆడపడుచులకు, డయాబెటిక్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాష్రూమ్స్ సిద్ధం చేశారు. వాటి సంరక్షణ కోసం శాశ్వతంగా ఒక సిబ్బందిని నియమించనున్నారు.స్థానిక వ్యాపారస్తులకు పిలుపునిచ్చి అక్కడ చిన్నచిన్న అంగళ్లు పెట్టుకునే విధంగా టెండర్ వేసి వారికి పరిశుభ్రత అప్పగిస్తే ఇంకా బాగుంటుందని స్వచ్ఛంద సేవకులు కోరుకుంటున్నారు.త్వరలోనే అన్ని సౌకర్యాలతో చిట్వేలి ఆర్టీసీ బస్టాండు ప్రయాణికుల వినియోగానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఆర్టీసీ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


