ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు
ఆగిరిపల్లి:
శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని మండలంలో పలు ఆలయాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తోటపల్లి లో వేంచేసి ఉన్న దుగ్గిరాల బాలరామ తల్లిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆగిరిపల్లి లోని కనకదుర్గ దేవి ఆలయంలో అమ్మవారిని ఆలయ అర్చకులు దేవులపల్లి శ్రీనివాసమూర్తి ప్రత్యేకంగా అలంకరించారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పాల పొంగళ్ళు సమర్పించారు.

ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు
ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు ఆగిరిపల్లి: శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని మండలంలో పలు ఆలయాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తోటపల్లి లో వేంచేసి ఉన్న దుగ్గిరాల బాలరామ తల్లిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆగిరిపల్లి లోని కనకదుర్గ దేవి ఆలయంలో అమ్మవారిని ఆలయ అర్చకులు దేవులపల్లి శ్రీనివాసమూర్తి ప్రత్యేకంగా అలంకరించారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పాల పొంగళ్ళు సమర్పించారు.

