పున్నమి ప్రతినిధి సురేష్
‘దైవసేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి’ జండా ఆవిష్కరణ
గన్నవరం నియోజవర్గం జనసముద్రం ప్రతినిధి సురేష్
2026 జనవరి 13 నుండి 15 వరకు జరుగు బ్రదర్ జోసెఫ్ తంబి 81 వ వర్ధంతి తిరునాళ్ళు సందర్భముగా జనవరి 4 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తంబి సమాధి వద్ద ఫాదర్లు, కన్యాస్త్రీలు, బ్రదర్లు, గుడి పెద్దలు, సంఘస్తులందరి సమక్షంలో రెవ.ఫాదర్.బి.సురేష్ బాబు ఎంఎస్ఎఫ్ఎస్, ప్రొవిన్సియల్ (విశాఖపట్నం) పతాకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు.
నవదిన ప్రార్ధనలలో మొదటిరోజు ఫాదర్.బి. సురేష్ బాబు ప్రసంగిస్తూ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడని, మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని, మనమందరం దేవుని ప్రేమ కలిగి వుండాలని, తంబి కూడా దేవుని ప్రేమకలిగి జీవించాడని, మనలని ప్రేమించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ఆయన మధ్యస్థ ప్రార్ధనల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని, దైవ ప్రేమ కలిగిన తంబి లాంటి వ్యక్తి మన మద్యలో వుండటం మన అదృష్టమన్నారు.
ప్రాన్సిస్కన్ కపూచిన్ సభకు చెందిన శ్రీ ప్రవీణ్ కుమార్ గోపు, ఓఎఫ్ఎం టోపీ. బ్రదర్ జోసెఫ్ తంబి జీవితం ఆధారంగా రచించిన “దైవసేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి ” అనే పుస్తకాన్ని మేరీమాత కపూచిన్ ప్రావిన్స్ ప్రొవిన్సియల్ ఫాదర్ మరియదాసు ప్రత్తిపాటి ఆవిష్కరించారు.
మొదటి రోజు ప్రార్ధనలను లూర్ధునగర్ వాసులు కొనియాడారు. నవదిన ప్రార్ధనలో పుణ్యక్షేత్ర రెక్టర్ జోసెఫ్ పాలడుగు, విచారణ గురువులు అభిలాష్ గోపు, సహాయక గురువులు, ఇతర గురువులు, మఠవాసులు, కన్యా స్త్రీలు, సంఘస్తులు, భక్తులు పాల్గొని తంబి తిరునాళ్ళు ఘనంగా జరగాలని ప్రార్ధనలు చేశారు.ప్రార్థనల అనంతరం పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసఫ్ పాలడుగు మాట్లాడుతూ దివ్య బలిపూజ సమర్పించిన ఫాదర్ సురేష్ బాబు కి దన్యవాదాలు తేలిపారు. నూతనంగా ఆవిష్కరించిన దైవ సేవకులుబ్రదర్ జోసెఫ్ తంబి పుస్తకం ప్రతి ఒక్కరు చదివి తంబి జీవితాన్ని ఆదర్శం గా తీసుకోని ఆయన అడుగు జాడల్లో నడవాలని, ఆయన సుగుణాలను మన జీవితాలలో కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. తిరునాళ్లకు కావలసిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని, . తంబి పండగ అందరి పండుగ అని ప్రతి ఒక్కరు సహృదయం తో సహకరించాలని కోరారు. తదనంతరం దివ్య బలి పూజ సమర్పించిన ఫాదర్ బి సురేష్ బాబు ని సన్మానించారు.



