దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లెక్కల కాంత రెడ్డి, తొమ్మిది మంది పాలకమండలి సభ్యులు..!
ప్రసిద్ధి కలిగిన ఆలయాన్ని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం.. ముఖ్యఅతిథితుల సందేశం..!
వింజమూరు పున్నమి న్యూస్ ప్రతినిధి : ఆగస్టు 29 ////
వింజమూరు మండలం నల్ల గొండ్ల గ్రామంలో నీలగిరి పర్వతంపై వేంచేసి యున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి, నూతన చైర్మన్ మరియు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం, ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ సినిమా హీరో గుత్తికొండ కార్తికేయ గారు హాజరయ్యారు. మాజీ చైర్మన్ లెక్కల చిన్న కొండారెడ్డి నివాసం వద్ద అతిధులకు ఘన స్వాగతం పలికారు. చైర్మన్ నివాసం నుండి ముఖ్య అతిథులు పాలక మండల సభ్యులు ఆలయం వరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు భాజ భజంత్రీలు, మేళ తాళాలు, బాణాచంచాలు లతో ఊరేగింపుగా వెళ్లారు. ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి, అధినాయకుడు గణపతికి, బోలా శంకరుడు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం గర్భగుడి వెలుపల ప్రాంగణంలో ఆలయ ఈవో శాంతయ్య ఆలయ చైర్మన్ గా లెక్కల కాంతారెడ్డి, చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడే పాలక మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశిష్ట అతిధులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి, లెక్కల చిన్న కొండారెడ్డి కుటుంబం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయం అభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి తలమానికం అవుతుందని చెప్పారు. అంతకుముందు పనిచేసిన చైర్మన్లు పాలకమండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అభినందించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. సినీ హీరో కార్తికేయ మాట్లాడుతూ, మా అత్తగారైన లెక్కల లక్ష్మీకాంతరెడ్డి, ఆలయ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం అందుకు నేను రావడం ఆనందంగా ఉందన్నారు. మామగారు ఎల్ సి కొండారెడ్డి ఆలయం గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారని, పెళ్లి సమయంలో వచ్చానని, ఇది రెండో పర్యాయం రావడం అని తెలిపారు. తిరుపతి,శ్రీశైలం ,అన్నవరం, తదితర ఆలయాల చేరువలో లక్ష్మీ నరసింహ స్వామి వెలుగొందాలని ఆకాంక్షించారు. అంతకుముందు లెక్కల చిన కొండారెడ్డి మాట్లాడుతూ పాలకమండలి సభ్యులలో ఎక్కువ మంది మహిళలు ఉండడం మహిళా చైర్మన్ ఉండడం విశేషం అన్నారు. ఆలయ అభివృద్ధికి శక్తివంతన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం వక్తలను, పాలక మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఉదయగిరి బిజెపి ఇంచార్జ్ కదిరి రంగారావు,పొలిటికల్ మేనేజర్ మాలే పార్టీ చైతన్య, ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్ అన్నపురెడ్డి ప్రమీల, మాజీ చైర్మన్లు భోగి రెడ్డి నాగిరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, లెక్కల మాలకొండ రెడ్డి, అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి, అన్నపురెడ్డి మోహన్ రెడ్డి, రూపునేని వెంకటేశ్వర్లు నాయుడు, లెక్కల చిన్న కొండారెడ్డి,లెక్కల రాజశేఖర్ రెడ్డి, బొల్లా వెంకటకృష్ణ, ఆకిలి రవి ప్రసాద్, అంకినపల్లి నరసింహులు, మీసాల నరసమ్మ, భోగి రెడ్డి శార్వాణి, చంచల సుభాషిని, పొన్నూరు అంకమ్మ, గ్రామ పెద్దలు నాయకులు, ఆయనకినపల్లి ఓబుల్ రెడ్డి, అంకినపల్లి శివశంకర్ రెడ్డి, ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, జడ్పిటిసి సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి,సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, కటకం ప్రసన్నకుమార్,చల్లా శ్రీనివాసుల యాదవ్, కొండారెడ్డి, రూపు నేని రత్నం, గాలి రామ్మోహన్ నాయుడు, గాలి నరసప నాయుడు, ఉదయగిరి మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, పాములపాటి మాల్యాద్రి, మద్దూరి రాజగోపాల్ రెడ్డి, పోలనేని చంద్రబాబు నాయుడు,ఆలయ ఈవో శాంతయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి, అన్నపురెడ్డి తిరుపాలు రెడ్డి, అన్నపురెడ్డి ధర్మారెడ్డి, బొల్లా సుబ్రహ్మణ్యం, బొమ్ము పెంచల రెడ్డి, బొమ్ము నరసింహారెడ్డి, వీరం రెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూపినేని అశోక్, భోగి రెడ్డి ఓబుల్ రెడ్డి, లెక్కల మురళి తదితరులు ఉన్నారు.


