Thursday, 2 April 2026
  • Home  
  • ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నివాళి
- E-పేపర్

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నివాళి

నంద్యాల లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి, దీపప్రజ్వలన చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ నాగేంద్రప్ప “మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలు భావితరాలకు మార్గదర్శకాలు. ఆయన ఆచరించిన సత్యం, అహింస మానవజాతికి శాశ్వత శక్తి మూలాలు. గాంధీజీ చూపిన మార్గం నేటికీ సమకాలీనమే. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సత్యాగ్రహం అనే అహింసా ఆయుధంతో విజయాన్ని సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యత నినాదాన్ని మనమందరం ఆచరించి, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఫకృద్ధిన్, సిటీ సహ అధ్యక్షులు వెంకట శివన్న, సిటీ సంయుక్త కార్యదర్శి యేసురత్నం, సభ్యులు బుల్లెట్ భాష, గంగాధర్ గౌడ్, గుండంపాడు రాముడు, ఎన్.యం.ఆర్./టైమ్ స్కేల్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్, సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.