ఖమ్మం ఏప్రియల్
(పున్నమి జిల్లా ఇంచార్జి )
వైరా మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే ను NHAI ప్రాజెక్టు మేనేజర్ దివ్య తో కలిసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్
పరిశీలించారు. త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవేప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవరం గ్రామం నుంచి వైరా పట్టణం రింగ్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు రోడ్డు ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.వాహనదారులు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగాఉండాలని,
వాహనదారులు సీట్ బెల్ట్ ,హెల్మెట్లు ధరించాలని,మైనర్లకు వాహనాలుఇవ్వరాదని, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దని సూచించారు.
కార్యక్రమంలో వైరా ఏసీపీ సారంగపాణి, సిఐ వెంకటప్రసాద్, ఎస్సైలు పాల్గొన్నారు.



