Monday, 8 December 2025
  • Home  
  • గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై పోరాడుతాను మండల అధ్యక్షులు జస్వంత్ కుమార్
- నాగర్‌కర్నూల్

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై పోరాడుతాను మండల అధ్యక్షులు జస్వంత్ కుమార్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 బిజినేపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న జశ్వంత్ కుమార్ ను ఇటీవల జరిగిన జిల్లా నాయకుల ఆధ్వర్యంలోని మండల ముఖ్య కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు జశ్వంత్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ – “రాబోయే రోజులలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామస్థాయి కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా పోరాటం చేస్తాను” అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మండల ఉపాధ్యక్షులు సామ శ్రీశైలం, సహాయ కార్యదర్శులు రవి, రాము, పలువురు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10
బిజినేపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న జశ్వంత్ కుమార్ ను ఇటీవల జరిగిన జిల్లా నాయకుల ఆధ్వర్యంలోని మండల ముఖ్య కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు జశ్వంత్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ –
“రాబోయే రోజులలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామస్థాయి కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా పోరాటం చేస్తాను” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మండల ఉపాధ్యక్షులు సామ శ్రీశైలం, సహాయ కార్యదర్శులు రవి, రాము, పలువురు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.