ఎల్లారెడ్డి/రామారెడ్డి, 7 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
మాత్తడి వాగు కట్ట మరమ్మతులు, ఆన్లైన్లో చేర్చేందుకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, పాలక వర్గం సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ల ను సమర్థించారు డివిజన్-4లోని మాత్తడి వాగు కట్ట గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతిని, ఇటీవలి వర్షాలతో మరింత దిగజారుతోందని చెప్పారు. ఈ కట్ట మరమ్మతు లేకపోతే గ్రామ ప్రజలకు తీవ్ర అసౌ కర్యం, వ్యవసాయ భూములకు నీటి సమస్యలు తప్పవు. అందుకే గ్రామ నాయకత్వం ఈ విషయా న్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్ మాట్లాడుతూ, మా వాగు కట్టను తక్షణ మరమ్మతు చేసి, ఆన్లై న్లో రిజిస్టర్ చేయాలి. ఇది గ్రామ ప్రజల భవిష్య త్తుకు కీలకం అని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ యశ్వంత్ రావు మాట్లాడుతూ,ఈవాగు వ్యవస్థను డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.ఈ వాగు ఆన్లైన్లో చేర్చబడితే ప్రజలు సులభంగా స్థితి తెలుసుకుని, మరమ్మతులు పార దర్శకంగా జరుగుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత అధికారులు సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వార్డు నాయకులు శగా నవీన్, పూర్మిశెట్టి హరీష్, దేమే రఘు సహా గ్రామ ప్రజలు పాల్గొని, తమ సమస్యలను వివరిం చారు. ఉపసర్పంచ్ యశ్వంత్ రావు, వార్డ్ నంబర్ 3 శగా నవీన్, పూర్మిశెట్టి హరీష్, గ్రామ ప్రజలు దేమే రఘు తదితరులు పాల్గొన్నారు.


