వింజమూరు అక్టోబర్ 27 పున్నమి పత్రిక ప్రతినిధి
కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వింజమూరు మండలం గోళ్ల వారి పల్లి గ్రామానికి చెందిన,గోళ్ల రమేష్ అనూష శశాంత్ మన్విత్ అంతిమయాత్రలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాలినడకన పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. సోమవారం జరిగిన అంత్యక్రియలకు ముందు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్, పార్ధువ మృతదేహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రమాదం జరిగిన రోజు గోళ్ల వారిపల్లె గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆరోజు రాత్రి వరకు అక్కడే ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకుంటూ, మృతదేహాలను తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మూడు రోజులపాటు, అన్ని తానై ఎమ్మెల్యే చూసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వచ్చిన మృతదేహాలకు, ఐస్ బాక్స్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు నుండి చివరి వరకు అన్నీ ఖర్చులు ఎమ్మెల్యే భరించారు. శోకసముద్రంలో ఉన్న కుటుంబానికి ధైర్యాన్ని చెపుతూ, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామస్తులు, బంధుమిత్రులను, సమాయత్తపరిచి ఘనంగా అంత్యక్రియల్లో కాకర్ల పాల్గొన్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ఆపద్బాంధవుడు, ఆత్మబంధువుగా నిలిచారు. గోళ్ల రమేష్ కుటుంబానికి కడసారి కన్నీటి వీడ్కోలు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని, కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గోళ్ల మాలకొండయ్య, కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా అందించడం జరిగిందన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి నివాసానికి కుటుంబ సభ్యులను పరామర్శించి,విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు, శ్రీ కాకర్ల చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఒక మూడు లక్షలు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, వారి కుటుంబాన్ని పరామర్శించి శ్రీ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఇవి కాకుండా బస్సు ఇన్సూరెన్స్, వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, అవి కూడా తొందరలోనే అందుతాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల్లో ఎక్స్గ్రేషియా అందించడం జరుగుతుందన్నారు. ఆర్థికపరంగా, భరోసా ఉన్నప్పటికీ, వారిని అన్ని విధాల ఆదుకునే బాధ్యత ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ప్రత్యేకంగా పోలీస్ వారికి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు,
అంతిమయాత్రలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ యాదవ్, మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు,కే శ్రీనివాసులు నాయుడు, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ,స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


