పున్నమి ప్రతినిధి
భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కళాశాలలో జంతు శాస్త్ర విభాగ ఆచార్యులుగా పనిచేస్తున్న డా. కొసారి సంతోష్ కుమార్ గారికి విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలకు “ఉత్తమ అధ్యాపకుల ప్రశంసనీయ అవార్డు” లభించింది. అలాగే జాతీయ సేవ పథకం (NSS) కార్యక్రమాల ద్వారా సామాజిక సేవలు అందించిన ఆరె రాజు గారికి “ఉత్తమ జాతీయ సేవా సమన్వయ కార్యకర్త అవార్డు” ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహమ్మద్, జిల్లా ఎస్.పి. జానకి షర్మిల గార్ల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ళ బుచ్చయ్య గారు అభినందనలు తెలిపారు.



