Wednesday, 1 April 2026
  • Home  
  • గువ్వల బాలరాజుతో కలిసి ప్రజాసేవా యాత్ర కొనసాగింపు బిజెపి యువ నాయకులు బత్తుల రాము యాదవ్
- నాగర్‌కర్నూల్

గువ్వల బాలరాజుతో కలిసి ప్రజాసేవా యాత్ర కొనసాగింపు బిజెపి యువ నాయకులు బత్తుల రాము యాదవ్

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి తమ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తామని బీజేపీ బల్మూర్ మండల యువ నేత బత్తుల రాము యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు గువ్వల బాలరాజును అవకాశవాది అని విమర్శిస్తున్నప్పటికీ, ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఏకైక ఉద్దేశ్యం ప్రజలకు సేవ చేయడమేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు విద్యార్థి నాయకుడిగా పనిచేయకపోయినా, వ్యాపారం చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ధ్యేయంతో బీఆర్ఎస్లో చేరిన విషయాన్ని రాము యాదవ్ గుర్తుచేశారు. ఆ తరువాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, దేశం మరియు తెలంగాణ అభ్యున్నతికి కృషి చేయాలన్న దృఢసంకల్పంతో బీజేపీలో చేరారని తెలిపారు. తాము కూడా సాధారణ కార్యకర్తలుగా గువ్వల బాలరాజుతో కలిసి బీజేపీ మార్గదర్శకత్వంలో, పార్టీ పెద్దల సూచనలతో, దేశం, తెలంగాణ రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తామని రాము యాదవ్ ప్రకటించారు. బీజేపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఆకర్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గతంలో “గరీబీ హటావో” నినాదం ఇచ్చి, చివరికి దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలు అనుసరించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఎలాంటి పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేశారో, అదే తపన మరియు త్యాగం దేశ రక్షణ కోసం కూడా అవసరమని రాము యాదవ్ పిలుపునిచ్చారు. బీజేపీ బల్మూర్ మండల యువ నేతగా, గువ్వల బాలరాజుతో కలిసి ప్రజల సమస్యలు వింటూ,వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, అభివృద్ధి సేవలతో ప్రజల విశ్వాసం నిలబెట్టుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.