నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
కోర్లపహాడ్ గ్రామం వద్ద ఉన్న టోల్ గేట్ కి కొంచెం ముందుగా మూసి కాలువ ఉన్నది. అక్కడి నుండి సుమారుగా 4 కిలోమీటర్లు వెళ్ళి, కుడి వైపు తిరిగితే ఇనుపాముల గ్రామం, ఎడమ వైపు వెళ్ళితే చెరుకుపల్లి గ్రామం వస్తుంది. ఈ రహదారి నుండి అనేక గ్రామాలకు వెళ్ళవచ్చును.
ఈ రోడ్డు దాదాపుగా సగానికి పైగా గుంతలు పడి మరియు కంకర తేలి ఉన్నది. వర్షాకాలంలో ఈ రోడ్డు వెంట వెళ్ళడానికి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.


