Wednesday, 11 February 2026
  • Home  
  • గిరిజన కాలనీలలో బొబ్బేపల్లి పర్యటన
- ఆంధ్రప్రదేశ్

గిరిజన కాలనీలలో బొబ్బేపల్లి పర్యటన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముత్తుకూరు (పున్నమి,అక్టోబర్ 22)-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజన కాలనీల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండలంలోని బలిజపాలెం గిరిజన కాలనీను సందర్శించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులను ఆరా తీసి, వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, సర్వేపల్లి పరిధిలో కూడా జనసేన నేతలు ప్రజలతో మమేకమవుతూ సహాయక చర్యల్లో భాగమవుతున్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పనిచేస్తోంది. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు

ముత్తుకూరు (పున్నమి,అక్టోబర్ 22)-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గిరిజన కాలనీల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు ముత్తుకూరు మండలంలోని బలిజపాలెం గిరిజన కాలనీను సందర్శించారు.

వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులను ఆరా తీసి, వారి అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే తెలియజేయాలని వారికి సూచించారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, సర్వేపల్లి పరిధిలో కూడా జనసేన నేతలు ప్రజలతో మమేకమవుతూ సహాయక చర్యల్లో భాగమవుతున్నారు.

బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పనిచేస్తోంది. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.