నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లాలో గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన ఉచిత టీకాల కార్యక్రమం గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు.
పశువులకు ఉచితంగా టీకాలు వేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి రాజేశ్వర్, బాలిక్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.


