గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గ పరిధిలో పద్మశాలీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కల్యాణ వేదిక నిర్మాణం చేపట్టాలని, ఇందుకు తగిన స్థలాన్ని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ పప్పు రాజారావు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు.ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలీ కుటుంబాలు శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రైవేట్ కళ్యాణ వేదికలను ఆశ్రయించాల్సి వస్తోందని,దీంతో వారికి తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వివరించారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తమ సామాజిక వర్గ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్యాణ వేదిక నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పప్పు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.



