గణేష్ మండపాలు ఏర్పాటకు అనుమతులు తప్పనిసరి.. ఎస్ఐ.. హనీఫ్..
పొదలకూరు: పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ ఐ హనీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ సేవ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఉత్సవాలను జరుపుకునేందుకు ముందుగా కమిటీ ఏర్పడాలన్నారు గణేష్ ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తెలిపే సూచనలను సలహాలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. డీజేలకు అసలీల నృత్యాలకు ఫైర్ కాకర్స్ కు అనుమతులు లేవని తెలిపారు. ముఖ్యంగా వినాయక మండపం ఏర్పాటుచేయ స్థలము నిమజ్జనం చేయు రోజు నిమజ్జనం చేసే ప్రదేశం పోలీసులకు తెలపాలని సూచించారు. గణేష్ మండపాలు వద్ద అగ్ని ప్రమాదం అరికట్టేందుకు కావలసిన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు.


