Wednesday, 25 February 2026
  • Home  
  • ఖమ్మంలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల ఘనంగా నిర్వహణ:
- ఖమ్మం

ఖమ్మంలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల ఘనంగా నిర్వహణ:

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కార్యకర్తలలో మరింత బలంగా ప్రతిష్టించాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని మినర్వాగ్రాండ్ వేదికగా బుధవారం “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల–2026” ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవాపురం లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి & ఖమ్మం జిల్లా ప్రబారి బద్దం మైపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత మరియు క్షేత్రస్థాయి కార్యాచరణ అత్యవసరమని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పెరుమాళ్లపల్లి విజయరాజు, చిలుకూరు రమేష్, నున్న రవి కుమార్, అల్లిక అంజయ్య రవి గౌడ్, మణిమందా సరస్వతి, గుత్త వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవ, ఆపతి రామరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కార్యకర్తలలో మరింత బలంగా ప్రతిష్టించాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని మినర్వాగ్రాండ్ వేదికగా బుధవారం “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యశాల–2026” ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.

జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవాపురం లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి & ఖమ్మం జిల్లా ప్రబారి బద్దం మైపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత మరియు క్షేత్రస్థాయి కార్యాచరణ అత్యవసరమని సూచించారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, పెరుమాళ్లపల్లి విజయరాజు, చిలుకూరు రమేష్, నున్న రవి కుమార్, అల్లిక అంజయ్య రవి గౌడ్, మణిమందా సరస్వతి, గుత్త వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవ, ఆపతి రామరావు, గడీల నరేష్, వంకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.