పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
ఖమ్మం నగర పరిధిలో జరుగుతున్న మున్నేరు కరకట్ట నిర్మాణ పనుల కారణంగా భారీ వాహనాలు దానవైగూడెం ప్రధాన రహదారి గుండా తరచుగా వెళ్తున్నాయి. దీని వల్ల రహదారిపై గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా గుర్తించిన అన్ని పార్టీ నాయకులు — బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.
వీరు కాంట్రాక్టర్ను కలసి రహదారి గుంతలను పూడ్చి ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యను అర్థం చేసుకున్న కాంట్రాక్టర్ వెంటనే స్పందించి రేపటిలోపు రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకుడు వల్లాల రమేష్ యాదవ్, బీఆర్ఎస్ 59వ డివిజన్ మాజీ అధ్యక్షుడు దామల రవి, మద్దెల ఉదయ్, బత్తుల యేసు, సీపీఐ నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తిరపయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టకుండా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.


