T.Ravinder
ఖమ్మం మార్చి12/2026
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం జిల్లాలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం – బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణకు పిలుపు.
ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న జరగనున్న ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
జనసేన పార్టీ వ్యవ స్థాపకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా జరపాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ, జిల్లా నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బైక్ ర్యాలీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

