Monday, 16 March 2026
  • Home  
  • ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నేత డా. విశారద మహారాజ్ అరెస్ట్*
- ఖమ్మం

ఖమ్మం కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నేత డా. విశారద మహారాజ్ అరెస్ట్*

T.Ravinder ఖమ్మం మార్చి16/2026 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నాయకుడు డా. విశారద మహారాజ్‌ను ఖమ్మం పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు. మొదట ఆయనను మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అనంతరం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయనను నందిగామ వైపు పోలీసులు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బీసీ నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. డా. విశారద మహారాజ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

T.Ravinder
ఖమ్మం మార్చి16/2026
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బీసీ నాయకుడు డా. విశారద మహారాజ్‌ను ఖమ్మం పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అక్కడి నుంచి తరలించారు.
మొదట ఆయనను మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌కు, అనంతరం మధిర రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయనను నందిగామ వైపు పోలీసులు తరలించారు.
ఈ ఘటనకు నిరసనగా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బీసీ నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
డా. విశారద మహారాజ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.