ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
ఖమ్మం కార్పొరేషన్ 21వ డివిజన్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులు చేపట్టిన డివిజన్ యాత్ర మరింత వేగంగా కొనసాగుతోంది. డివిజన్ నాయకులు పిల్లల మర్రి వెంకట్, శ్రీమతి రజిత దంపతులు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, వాటి ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. శనివారం నిర్వహించిన డివిజన్ యాత్రలో పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్తో పిల్లల మర్రి వెంకట్ దంపతులు మాట్లాడుతూ, అభివృద్ధి కోసం పోరాటమే తమ లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. 21వ డివిజన్లో కమల వికాసమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.
తమ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డివిజన్ యాత్ర ఏడవ రోజు విజయవంతంగా సాగుతుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని వారు తెలిపారు.



