పున్నమి ప్రతినిధి, జనగాం: Sep 16:
కోడకండ్ల మండల పరిధిలోని జడ్పి హైస్కూల్ ఏడునూతులలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొండ్ర కమల్ కుమార్ గారికి “మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” లభించింది. ఈ అవార్డును మండల విద్యా కార్యాలయం ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డీ.ఓ., మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు, డీ.టీ, పీజీహెచ్ఎం ల గార్ల సమక్షంలో ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి గ్రేస్ కేజియా రాణి గారు మాట్లాడుతూ: “విద్యార్థుల ప్రగతి కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు నిజమైన ప్రేరణాదాయకులు” అని అన్నారు.
జడ్పిహెచ్ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “మా పాఠశాల ఉపాధ్యాయుడు ఈ అవార్డు పొందటం మా పాఠశాలకు గౌరవం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని అభినందించారు.


