శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): సాధించాలనే తపన ఉంటే వసతులు లేకున్నా విజయం వరిస్తుందని శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థి కమలేష్ యాదవ్ నిరూపించాడు. పట్టణంలోని రత్నం స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి, సరైన శిక్షకుడు (కోచ్) లేకపోయినా, ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ అందుబాటులో లేకపోయినా తనకున్న ఆసక్తితో రోలర్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న కమలేష్, ఏకంగా మూడు పతకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 100 మీటర్ల విభాగంలో రజత పతకం, 200 మరియు 500 మీటర్ల విభాగాల్లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడు. కమలేష్‌కు స్కేటింగ్ అంటే మక్కువ ఉన్నా, శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో తన తండ్రి సాయం తీసుకున్నాడు. ఎటువంటి సౌకర్యాలు లేని స్థితిలో నిత్యం జాతీయ రహదారి (హైవే) పైనే ప్రాక్టీస్ చేస్తూ మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కష్టమే నేడు జిల్లా స్థాయిలో పతకాలు తెచ్చిపెట్టింది. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించిన స్కూల్ యాజమాన్యం, పట్టణ ప్రముఖులు కమలేష్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విద్యార్థి మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

కోచ్ లేకున్నా.. హైవేపైనే ప్రాక్టీస్ చేస్తూ.. మూడు పతకాలు కొల్లగొట్టిన కమలేష్!