కామారెడ్డి, 22 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ , సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, ఇతర సిబ్బంది సమకూరారు. వెనుకబడిన లారీల కారణంగా ధాన్య సరఫరాకు అడ్డంకులు తలెత్త కుండా, డీసీవో స్పందించి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ను వెంటనే లారీల పంపిణీకి ఫోన్ చేశారు. ఈ చర్య రైతులకోసం వరి కొనుగోలును వేగవంతం చేయడానికి ఉపకరిస్తుందని అధికారులు తెలిపా రు.ఈ అంశం మీద స్థానిక ఆరోపణలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం రైతుల నియ మిత కొనుగోలును సులభతరం చేస్తుంది అని తెలిపారు.


