Thursday, 12 February 2026
  • Home  
  • కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
- E-పేపర్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

అన్నమయ్య జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. నేటి నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ పిలుపులో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లిమండలం మంగంపేట లో ఏఐటీయూసీ కార్మికసంఘాల తో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులకు తీవ్ర నష్టం కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక వర్గం గత ఆ ఐదు సంవత్సరాల నుంచి అలుపెరిగిన పోరాటాలు సాగిస్తున్న, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పింది వేదం కానున్నది. కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక హక్కులపై కోతపడుతుంది. మహిళా కార్మికులను నైట్ షిఫ్ట్ లు పని చేయించడం వల్ల వారికి భద్రత కరువు అవుతుంది. పని గంటల పెంపు వల్ల ఇండస్ట్రీలలో కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్ర అలసటకు గురై, అనారోగ్యానికి గురి అవుతారు. ఈ లేబర్ కోడ్లు అమలువైతే కార్మికుల జీవితాలు, జీవనోపాధి ని చంపేయడమే అవుతుంది. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి కార్మిక వ్యవస్థ వెళుతుంది. అందుకని ఈ నాలుగు లేపల కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ త్రివేణి కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు కోశాధికారి వరప్రసాద్ పూర్ణ కుమార్ రాజు కార్మికులు పెంచలయ్య రమణ భాష వెంకటరమణ చిన్నయ్య సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రామకృష్ణ, నరసింహమూర్తి, రవి, వెంకటేశ్వరరావు, శ్రీను, రాహుల్, ప చంటి, శ్రీనివాసరావు, నారాయణ, కృష్ణ, ,తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామనీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు మాదరాజు గంగాధర్ ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

అన్నమయ్య జిల్లా

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

నేటి నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి జాతీయ కౌన్సిల్ పిలుపులో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లిమండలం మంగంపేట లో ఏఐటీయూసీ కార్మికసంఘాల తో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ
అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ
కార్మికులకు తీవ్ర నష్టం కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక వర్గం గత ఆ ఐదు సంవత్సరాల నుంచి అలుపెరిగిన పోరాటాలు సాగిస్తున్న, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పింది వేదం కానున్నది. కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక హక్కులపై కోతపడుతుంది. మహిళా కార్మికులను నైట్ షిఫ్ట్ లు పని చేయించడం వల్ల వారికి భద్రత కరువు అవుతుంది. పని గంటల పెంపు వల్ల ఇండస్ట్రీలలో కర్మాగారంలో పనిచేసే కార్మికులు తీవ్ర అలసటకు గురై, అనారోగ్యానికి గురి అవుతారు. ఈ లేబర్ కోడ్లు అమలువైతే కార్మికుల జీవితాలు, జీవనోపాధి ని చంపేయడమే అవుతుంది. కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి కార్మిక వ్యవస్థ వెళుతుంది. అందుకని ఈ నాలుగు లేపల కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ త్రివేణి కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు కోశాధికారి వరప్రసాద్ పూర్ణ కుమార్ రాజు కార్మికులు పెంచలయ్య రమణ భాష వెంకటరమణ చిన్నయ్య సుబ్రహ్మణ్యం రెడ్డయ్య రామకృష్ణ, నరసింహమూర్తి, రవి, వెంకటేశ్వరరావు, శ్రీను, రాహుల్, ప చంటి, శ్రీనివాసరావు, నారాయణ, కృష్ణ, ,తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోతే
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామనీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు
మాదరాజు గంగాధర్
ఏఐటియుసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.