కే.వి.బి. పురం, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21: కే.వి.బి. పురం మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ రాగిగుంట పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ఎస్. వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో, ఆర్. శ్రీలక్ష్మి,సుహాసిని ఇతర ఉపాధ్యాయులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తలు మాట్లాడుతూ…. ఒక జాతి మనుగడకు మాతృభాష అత్యంత అవసరమని తరించిపోతున్న అనేక జాతుల మనుగడకు మాతృభాష పరిరక్షణ ఎంతో ముఖ్యమని మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగేటట్లు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన “భువనవిజయం” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం విద్యార్థులను మాత్రమే కాకుండా గ్రామస్తులను కూడా ఎంతో ఆకట్టుకుంది. విద్యార్థులు చారిత్రక పాత్రలను ధరించి అద్భుతంగా ప్రదర్శన ఇవ్వగా విద్యార్థుల కోసం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడంజరిగినది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

కే.వి.బి. పురం మండలంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు