-టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ
సిద్దవటం డిసెంబర్ 1 పున్నమి ప్రతినిధి
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు. రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమట్టి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండలంలోని మల్లేశ్వరం సోమవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల కార్యక్రమంలో మల్లేశ్వరపురం గ్రామం ఎస్సీ కాలనీలో సచివాలయం సిబ్బందితో కలిసి కోటపాటి సుబ్బమ్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకటో తారీకు అనగానే ఒక పండగ వాతావరణం కనబడుతుందన్నారు.ఉదయం 7 గంటల నుండి సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు,వికలాంగులకు, ఒంటరి మహిళలకు వివిధ రకాల పెన్షన్లను సచివాలయం సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందన్నారు.వైకాపా నాయకులు మాత్రం విషం చిమ్ముతూ పెన్షన్లను తొలగిస్తున్నారని పెన్షన్ దారులలో ఆందోళన కలిగిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంలో అనేక అక్రమ పెన్షన్లను నమోదు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క అర్హులకి పెన్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారని ఆమె తెలియజేశారు.


