Wednesday, 25 March 2026
  • Home  
  • కువైట్‌లో రాజంపేట జిల్లా కేంద్రం కోసం సంఘీభావ సమావేశం ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహణ
- అన్నమయ్య

కువైట్‌లో రాజంపేట జిల్లా కేంద్రం కోసం సంఘీభావ సమావేశం ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహణ

రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాజంపేటలో జరుగుతున్న ప్రజా ఉద్యమానికి సంఘీభావంగా,కువైట్‌లోని రాజంపేట ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజలు శనివారం ఐక్యంగా సమావేశమయ్యారు. ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తమ స్వస్థల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా ఏర్పాటు సాధనకై రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం కీలకం అవుతుందని సమావేశంలో స్పష్టం చేశారు.రాజంపేటలో ఉధృతంగా సాగుతున్న ప్రజా ఆందోళనలకు, కువైట్‌లో నివసిస్తున్న రాజంపేట ప్రజలంతా పూర్తి మద్దతు ప్రకటించారు.“మా స్వరం రాజంపేట వరకు చేరే వరకు, మా న్యాయ డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని సమావేశంలో నాయకులు హామీ ఇచ్చారు.ఈ సంఘీభావ సమావేశంలో ధరురు బలరాం నాయుడు, ఓలేటి దివాకర్, మాలేపాటి సురేష్ బాబు, మాలేపాటి బాబు, పోలారపు బాబు, ములక రవి, రమేష్ దుగ్గినేని, మురళి, మదిన ఈశ్వర్, వీరబల్లి అంజి రెడ్డయ్య, నాయుడు సుదర్శన్, మాలార్పు భాస్కర్, కూరపాటి చంద్ర, పూరపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాజంపేటలో జరుగుతున్న ప్రజా ఉద్యమానికి సంఘీభావంగా,కువైట్‌లోని రాజంపేట ప్రాంతానికి చెందిన తెలుగు ప్రజలు శనివారం ఐక్యంగా సమావేశమయ్యారు. ములకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, తమ స్వస్థల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని సంకల్పం వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా ఏర్పాటు సాధనకై రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం కీలకం అవుతుందని సమావేశంలో స్పష్టం చేశారు.రాజంపేటలో ఉధృతంగా సాగుతున్న ప్రజా ఆందోళనలకు, కువైట్‌లో నివసిస్తున్న రాజంపేట ప్రజలంతా పూర్తి మద్దతు ప్రకటించారు.“మా స్వరం రాజంపేట వరకు చేరే వరకు, మా న్యాయ డిమాండ్ నెరవేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని సమావేశంలో నాయకులు హామీ ఇచ్చారు.ఈ సంఘీభావ సమావేశంలో ధరురు బలరాం నాయుడు, ఓలేటి దివాకర్, మాలేపాటి సురేష్ బాబు, మాలేపాటి బాబు, పోలారపు బాబు, ములక రవి, రమేష్ దుగ్గినేని, మురళి, మదిన ఈశ్వర్, వీరబల్లి అంజి రెడ్డయ్య, నాయుడు సుదర్శన్, మాలార్పు భాస్కర్, కూరపాటి చంద్ర, పూరపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.