కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా మారాలని సూచించారు.
ఇక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ నూతన భవనం పూర్తయిన తరువాత ప్రభుత్వ సేవలు గ్రామ ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



