కామారెడ్డి, 08 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఉప్పల్వా యి గ్రామంలో కుటుంబ కలహాలతో కుమ్మరి రాములు (50) తండ్రి పోశయ్యా అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఎస్ఐ.రాజశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు శవాన్ని గమనించి పోలీసులకు సమా చారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజశేఖర్‌లు పరిస్థితులు పరిశీ లించి వివరాలు సేకరించారు. శవాన్ని కామారెడ్డి (జి.జి.ఎచ్ ) ఆరోగ్యకేంద్రానికి పోస్టుమార్టం నిమి త్తం తరలించారు.ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, మృతుని భార్య మన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నాము. మరిన్ని వివరాలు తెలుస్తే తెలియజేస్తాము అని తెలిపారు. గ్రామస్థు లు ఈ సంఘటనపై విషాదం వ్యక్తం చేస్తున్నారు



