దేవనకొండ, సెప్టెంబర్ 6(పున్నమి రచయిత):
దేవనకొండ మండలం కుంకనూర్ గ్రామంలోని ZP హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణాత్మక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం సమన్వయంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అయిన మహేంద్ర కోటకొండ గారు, K.K. ధామోదర్ రావు గారు విద్యార్థులకు సమయ నిర్వహణ, లక్ష్య సాధన తద్వారా. విజయ సాధన ల వంటి అంశాలపై సూచనలు అందించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలువైన మార్గదర్శకాన్ని స్వీకరించారు.
తరగతుల అనంతరం ఉపాధ్యాయులు మోటివేషనల్ స్పీకర్స్ ను ఘనంగా సన్మానించారు. ఇలాంటి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు ఉన్నత స్థాయి మార్గదర్శనం ఉచితంగా అందించాలనే లక్ష్యంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వెళ్తుందని రీజియన్ ప్రెసిడెంట్ మహేంద్ర కోటకొండ గారు తెలిపారు.


