Wednesday, 25 March 2026
  • Home  
  • కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కాలభైరవ భక్తి రంజకంగా ఉత్సవాలు
- కామారెడ్డి

కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కాలభైరవ భక్తి రంజకంగా ఉత్సవాలు

కామారెడ్డి, 9 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో ఉన్న దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ కాలభైరవస్వామి దేవాలయం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ప్రంగణం కార్తీకమాసం సందడి మధ్య ఆధ్యాత్మి కతతో కిటకిటలాడింది.కార్తీకమాసం కారణంగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుం దనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణం వెలుగొందింది. కార్తీక పౌర్ణమి అనంతరం ప్రారంభ మైన భైరవుని జన్మదిన మహోత్సవాలు వచ్చే ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగ నున్నాయని ఆలయ ఈఓ ప్రభు స్వామి తెలిపా రు.నవంబర్ 09 నుంచి 13 వరకు జరగ నున్న ఈ మహోత్సవాల్లో డోలారోహణం (తొట్టె), భజన మండళ్లు, రథోత్సవం, అగ్నిగుండాల కార్య క్రమాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమితి ఆధ్వర్యంలో వసతి గదులు, స్నానాల గదులు, నిత్య అన్నదానం వంటి సదుపాయాలు విస్తృతంగా కల్పించబడ్డాయి. ఈ మాసంలో చేసే పూజలు ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం, పౌర్ణమి రోజుల్లో భక్తజనం రద్దీ మరింత పెరుగు తున్నట్లు వెల్లడిం చారు.స్థానిక విశ్వాసాల ప్రకారం ఆలయంలోని మూలబావి వద్ద స్నానం చేసి, స్వామి వారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఇక్కడి ప్రజలకు ఉంది. ఆలయం పరిస రాల్లో శనేశ్వరాలయం, బద్దిపోచ మ్మ దేవాలయం, నవగ్ర హ మండపం, సంతాన నాగదేవత విగ్రహా లుండటం ఈ ప్రాంత ఆధ్యాత్మి కతకు మరింత వైభవం చేకూరుస్తోంది. ఉత్సవాలు భాగంగా మొదటి రోజు బాగా మొదటి రోజు బద్ది పోచమ్మకు బోనాల సమర్పణ ఘనంగా నిర్వహించారు. నిర్వ హించారు.ఈ మహోత్సవాల్లో ఆలయ కమిటీ, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక మాజీ సర్పం చ్‌లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

కామారెడ్డి, 9 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో ఉన్న దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ కాలభైరవస్వామి దేవాలయం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ప్రంగణం కార్తీకమాసం సందడి మధ్య ఆధ్యాత్మి కతతో కిటకిటలాడింది.కార్తీకమాసం కారణంగా రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుం దనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయ ప్రాంగణం వెలుగొందింది. కార్తీక పౌర్ణమి అనంతరం ప్రారంభ మైన భైరవుని జన్మదిన మహోత్సవాలు వచ్చే ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగ నున్నాయని ఆలయ ఈఓ ప్రభు స్వామి తెలిపా రు.నవంబర్ 09 నుంచి 13 వరకు జరగ నున్న ఈ మహోత్సవాల్లో డోలారోహణం (తొట్టె), భజన మండళ్లు, రథోత్సవం, అగ్నిగుండాల కార్య క్రమాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సమితి ఆధ్వర్యంలో వసతి గదులు, స్నానాల గదులు, నిత్య అన్నదానం వంటి సదుపాయాలు విస్తృతంగా కల్పించబడ్డాయి. ఈ మాసంలో చేసే పూజలు ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం, పౌర్ణమి రోజుల్లో భక్తజనం రద్దీ మరింత పెరుగు తున్నట్లు వెల్లడిం చారు.స్థానిక విశ్వాసాల ప్రకారం ఆలయంలోని మూలబావి వద్ద స్నానం చేసి, స్వామి వారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఇక్కడి ప్రజలకు ఉంది. ఆలయం పరిస రాల్లో శనేశ్వరాలయం, బద్దిపోచ మ్మ దేవాలయం, నవగ్ర హ మండపం, సంతాన నాగదేవత విగ్రహా లుండటం ఈ ప్రాంత ఆధ్యాత్మి కతకు మరింత వైభవం చేకూరుస్తోంది. ఉత్సవాలు భాగంగా మొదటి రోజు బాగా మొదటి రోజు బద్ది పోచమ్మకు బోనాల సమర్పణ ఘనంగా నిర్వహించారు. నిర్వ హించారు.ఈ మహోత్సవాల్లో ఆలయ కమిటీ, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక మాజీ సర్పం చ్‌లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.