ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గిరిజన కాలనీవాసులు రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. జగనన్న కాలనీలో 460 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనప్పటికీ సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వర్షాకాలంలో అంబులెన్స్, గ్యాస్, తాగునీటి వాహనాలు రాలేని పరిస్థితి ఉందన్నారు. నిరసనను గమనించిన సాగునీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్లు కాలనీవాసులను రమాదేవి వద్దకు తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హామీ ఇచ్చారు.

కాలనీకి రోడ్డు మార్గం కోసం గిరిజనుల నిరసన.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గిరిజన కాలనీవాసులు రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. జగనన్న కాలనీలో 460 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనప్పటికీ సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వర్షాకాలంలో అంబులెన్స్, గ్యాస్, తాగునీటి వాహనాలు రాలేని పరిస్థితి ఉందన్నారు. నిరసనను గమనించిన సాగునీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్లు కాలనీవాసులను రమాదేవి వద్దకు తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హామీ ఇచ్చారు.

