నంద్యాల … తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గుర్తింపు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇటీవల టీడీపీ అధికారం లోకి రావడానికి పార్టీ అమలు చేసిన CUB (క్లస్టర్, యూనిట్, బూత్) వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. “క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యవస్థ చాలా బాగా పని చేసిందని. పార్టీ కోసం రోజువారీగా కష్టపడిన నిజమైన యోధులు ఈరోజు ఇక్కడ ప్రమాణస్వీకారం చేస్తున్నారని. ఇది కేవలం పదవి కాదు, పార్టీ పట్ల వారి నిబద్ధతకు దక్కిన గౌరవం” అని అన్నారు . పదవులు దక్కిన వారికే కాకుండా, పదవులు రాని కార్యకర్తలకు కూడా మంత్రి కీలక సందేశం అందించారు. “ఎవరికి పదవులు వచ్చినా, రాకపోయినా ఎవరూ నిరాశ పడకూడదని . పార్టీలో అందరూ సమానమే. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. మనందరి లక్ష్యం ఒకటే—రాష్ట్రాభివృద్ధి మరియు పార్టీ బలోపేతం” అని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త సహకారం పార్టీకి అత్యంత ముఖ్యమని తెలిపారు . అలాగే కార్యకర్తలందరూ తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి, రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని మంత్రి ఫరూక్ సూచించారు. “మన ముందున్న తక్షణ లక్ష్యం రాబోయే స్థానిక ఎన్నికలన్నారు . టౌన్ మరియు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో మన అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కలసికట్టుగా, సమన్వయంతో కృషి చేయాలని. స్థానిక ఎన్నికల్లో మన విజయం, భవిష్యత్తులో పార్టీకి మరింత బలాన్నిస్తుంది” అని దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నూతనంగా ఎన్నికైన మండల, క్లస్టర్, యూనిట్ మరియు బూత్ కమిటీ సభ్యుల చేత పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కొట్టాల శివ నాగిరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ , ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ , నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి , గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , గోస్పాడు సొసైటీ చైర్మన్ వీర సింహారెడ్డి , కౌన్సిలర్ నాగార్జున , టిడిపి సీనియర్ నాయకులు బాలిశ్వర్ రెడ్డి మరియు నంద్యాల నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ మరియు యువ టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


