పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ పరిశీలించి వరద ఉధృతి ఏ మేరకు ఉందో ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గంట గంటకు నీటి ప్రవాహం పెరగడంతో కాండ్రకోట గ్రామం నుంచి కట్టమూరు , జె.తిమ్మాపురం తో పాటు రైతులు పొలాల కెళ్లే పాత రన్ వే పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు, రైతులు పశువుల విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు.తహాశీల్దార్ వెంట ఇరిగేషన్ ఏఈ నిమ్మకాయల శ్రీనివాసరావు ఉన్నారు.

కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న తహశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి.
పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ పరిశీలించి వరద ఉధృతి ఏ మేరకు ఉందో ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. గంట గంటకు నీటి ప్రవాహం పెరగడంతో కాండ్రకోట గ్రామం నుంచి కట్టమూరు , జె.తిమ్మాపురం తో పాటు రైతులు పొలాల కెళ్లే పాత రన్ వే పై నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు, రైతులు పశువుల విషయం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వెల్లడించారు.తహాశీల్దార్ వెంట ఇరిగేషన్ ఏఈ నిమ్మకాయల శ్రీనివాసరావు ఉన్నారు.

