ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం దుద్దుపూడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు మట్ట ప్రసాద్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగమయి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ సమక్షంలో మట్ట ప్రసాద్ అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయనకు పార్టీలో స్వాగతం పలికారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని మట్ట ప్రసాద్ పేర్కొన్నారు.


