*కాంగ్రెస్ తోనే ప్రజా స్వామ్యానికి ఊపిరి : ప్రియాంక దండి*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
దేశంలో ఎప్పుడు లేని విధంగా మోదీ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ” ఓటు చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు, విశ్రాంతి ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ దేశంలో అన్ని వ్యవస్థలను ఎన్ డి ఏ ప్రభుత్వం నాశనం చేసిందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ చేతిలో పెట్టుకొని ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తోందని, ప్రజలు మేలుకోవాల్సిన సమయం వచ్చింది, మన ఓటుని దొంగలించి బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజలు ఉద్యమంలా లేఖలు రాసి ప్రజాగ్రహాన్ని తెలియజేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఆలీ,జగన్ మురారి, వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, వేమూరి సురేష్, చింతగుంటి వెంకటేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్ర మౌళి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


