Tuesday, 17 March 2026
  • Home  
  • “కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ – తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న
- News

“కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ – తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న

“కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు) బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ – తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న ****************** జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క పోచ రాజయ్య (నక్క రాజు) ఆదివారం సాయంత్రం తిరుపతి లోని జి.ఎస్.కె.ఆర్. భవన్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా “కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్నారు. బహుజన జాతీయవాది మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి సందర్భంగా తిరుపతిలో 18వ జాతీయ స్థాయి సాహితీ వేత్తల సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభను బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా నక్క పోచ రాజయ్య (నక్క రాజు)చేస్తున్న కళా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, ఉద్యమ కళా ప్రదర్శనలు, 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం, తెలంగాణ ఉద్యమ కారునిగా అందించిన ఉద్యమ కార్యక్రమాలు, నేటికీ సమాజ హితం కోసం ఆయన చేస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, యువత గంజాయి, డ్రగ్స్ లకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం సదస్సులు, మహిళలకు, బాలికలకు భరోసా లాంటి కార్యక్రమాలను నిర్వహించడం లాంటి అతని గొప్ప కలలను గుర్తించి ఈ “కళారత్న నేషనల్ అవార్డ్” అందించడం జరిగిందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి తదితర రాష్ట్రాల డెలిగెట్స్ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో పాటు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటి మెంబర్ డా.దరువు ఎల్లన్న, తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ విష్ణు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుకుట్ల విజయ కుమార్, ప్రముఖ అంబేద్కరిస్ట్ ఉద్యమ నాయకులు మామిడిపల్లి బాపన్న, ప్రముఖ రచయిత, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.డి.వెంకమ్మ, కేరళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళారాణి, తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రాజేషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఎన్. వర ప్రసాద్ లతో పాటు వివిధ రాష్ట్రాల, జిల్లాల బాధ్యులు, జాతీయ అవార్డుల సెలెక్షన్ కమిటి సభ్యుడైన సేవా రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ ఉద్యమ కారులు చుక్క గంగారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు. – బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం – బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ సౌత్ ఇండియా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ భారత దేశంలోని బహుజనుల నుండి సాహిత్య పరమైన, సమాజ సేవా పరమైన ఆణిముత్యాలను, త్యాగధనులను వెలికితీసి వారికి తగ్గ గుర్తింపు నిచ్చి అవార్డులతో సత్కరించ డమే మన బహుజన సాహిత్య అకాడమీ సంస్థ లక్ష్యమని వివరించారు. 2017 లో పురుడు పోసుకున్న మన బహుజన సాహిత్య అకాడమీ నేడు జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాలకు, ప్రపంచ స్థాయిలో 8 దేశాలకు విస్తరించిందన్నారు. నేపాల్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభ జరిగిందన్నారు. త్వరలో మలేషియాలో కూడా అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభ జరగనుందని ఆయన పేర్కొన్నారు. మన భారత దేశంలోని వివిధ ముఖ్యమైన నగరాలలో ఇప్పటి వరకు జరిగిన ఈ18 కాన్ఫరెన్స్ ల ద్వారా జాతీయ స్థాయిలో వేలాది మంది సాహితీ వేత్తలకు, కవులు – కళాకారులకు, ఉద్యమ కారులకు, సమాజ సేవకులకు, త్యాగ ధనులకు ఆణిముత్యాలుగా గుర్తించి అవార్డులు అందజేయడం జరిగిందన్నారు. అవార్డుల ప్రాధాన్యత, వాటి గొప్ప తనం గూర్చి తనదైన శైలిలో “పాట – మాట” రూపంలో కండ్లకు కట్టినట్లు వివరించి సభికులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మన దేశ మహానీయుల గూర్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాహితీ వేత్తల గురించి, ప్రముఖుల గూర్చి, జాతి రత్నాలైన మన దేశ మహానీయుల గూర్చి, వారి సేవల గూర్చి చాలా చక్కగా వివరించారు. వారి గొప్ప తనాలను ముందు తరాలకు చాటి చెప్పేందుకే అలాంటి మహానీయుల పేరిట మన “బహుజన సాహిత్య అకాడమీ” ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందజేయడం జరుగుతోందని సూచించారు. గతంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ సభలకు ప్రజా యుద్ధ నౌక గద్దర్, జయరాజ్, విమలక్క, మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబు లాంటి తదితర గొప్ప సాహితీ వేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని తెలుపుతూ వారి – వారి గొప్ప తనాల గూర్చి కూడా సభికులకు వివరించారు. నేడు మన తెలంగాణ ఉద్యమ కళాకారులైన సాహితీ వేత్త డాక్టర్ దరువు ఎల్లన్న ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని తెలుపుతూ దరువు ఎల్లన్న గొప్ప తనాన్ని, ఆయన ఉద్యమ సేవలను, జైలు జీవితాన్ని, కలలను, ఆయన రచనలను, పాటలను సభికులకు నల్లా రాధాకృష్ణ సవివరంగా తెలియజేశారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవి – సౌత్ ఇండియా సభలో చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ ఉద్యమ కళాకారులు డాక్టర్ దరువు ఎల్లన్న మాట్లాడుతూ మా తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవని సౌత్ ఇండియా సభలో చాటి చెప్పారు. “వీరులారా వందనం – విద్యార్థి అమరులారా వందనం” పాటను ఆలపించారు. తెలంగాణ ఉద్యమ తీరును, తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను, తెలంగాణ కలలను, కవులు – కళాకారుల, విద్యార్థుల, ఉద్యమ కారుల పోరాటాలను, తెలంగాణ సంస్కృతిని వివరిస్తూ తనదైన శైలిలో ఉద్యమ గీతాలను ఆలపించి సభికులను ఆశ్చర్యశకితులను చేశారు. వివిధ రాష్ట్రాల నుండి సౌత్ ఇండియా స్థాయిలో ఇట్టి సదస్సుకు హాజరైన ప్రముఖులు, అవార్డ్ గ్రహీతలు, సభికులకు బాహుజనుల గురించి, ప్రభుత్వాల బాధ్యతల గురించి చాలా చక్కగా వివరించారు. బహుజన సాహిత్య అకాడమీ ద్వారా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా ఈ సభ్య సమాజానికి ఉపయోగ పడేలా మీ సేవలను, కలలను, సాహిత్యాలను ప్రదర్శించాలని కోరారు. బహుజన సాహిత్య అకాడమీ సంస్థ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి నేడు ఎదిగిందని, ఈ సంస్థ వ్యవస్థాపకులైన నల్లా రాధాకృష్ణ సేవలు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ కళలను గొప్ప కలలుగా, మన సాహిత్యం గొప్ప సాహిత్యంగా చాటిచెప్పడం ఎంతో గర్వంగా ఉందని దరువు ఎల్లన్న పేర్కొన్నారు. ఇంత గొప్పగా ప్రపంచ స్థాయికి ఎదిగి మన దేశ ఔన్నత్యాన్ని, మన కలలను, సాహిత్యాలను గుర్తించి అవార్డులు అందజేసి యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న ఘనత కేవలం బహుజన సాహిత్య అకాడమీ కే దక్కిందని సభకు హాజరైన వక్తలు, ప్రముఖులు కొనియాడారు. మన దేశ ప్రభుత్వం ఈ బహుజన సాహిత్య అకాడమీని గుర్తించి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ కు “భారత రత్న అవార్డు” ప్రకటించాలని ఈ సభలో ముక్త కంఠంతో కోరుతూ సభా తీర్మానంగా ప్రకటించారు. Uploaded Video:

“కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్న నక్క పోచ రాజయ్య ( నక్క రాజు)

బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం

– సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ

– తెలంగాణ అమర వీరుల త్యాగాలను చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న

******************

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క పోచ రాజయ్య (నక్క రాజు) ఆదివారం సాయంత్రం తిరుపతి లోని జి.ఎస్.కె.ఆర్. భవన్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా “కళారత్న నేషనల్ అవార్డ్” అందుకున్నారు.
బహుజన జాతీయవాది
మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి సందర్భంగా తిరుపతిలో 18వ జాతీయ స్థాయి సాహితీ వేత్తల సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభను బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.
దాదాపు గత రెండు దశాబ్దాలుగా నక్క పోచ రాజయ్య (నక్క రాజు)చేస్తున్న కళా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, ఉద్యమ కళా ప్రదర్శనలు, 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం, తెలంగాణ ఉద్యమ కారునిగా అందించిన ఉద్యమ కార్యక్రమాలు, నేటికీ సమాజ హితం కోసం ఆయన చేస్తున్న ప్రజా అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, యువత గంజాయి, డ్రగ్స్ లకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం సదస్సులు, మహిళలకు, బాలికలకు భరోసా లాంటి కార్యక్రమాలను నిర్వహించడం లాంటి అతని గొప్ప కలలను గుర్తించి ఈ “కళారత్న నేషనల్ అవార్డ్” అందించడం జరిగిందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి తదితర రాష్ట్రాల డెలిగెట్స్ తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో పాటు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటి మెంబర్ డా.దరువు ఎల్లన్న, తెలంగాణ రాష్ట్ర కో – ఆర్డినేటర్ విష్ణు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుకుట్ల విజయ కుమార్,
ప్రముఖ అంబేద్కరిస్ట్ ఉద్యమ నాయకులు మామిడిపల్లి బాపన్న, ప్రముఖ రచయిత, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.డి.వెంకమ్మ, కేరళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళారాణి, తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి రాజేషన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఎన్. వర ప్రసాద్ లతో పాటు వివిధ రాష్ట్రాల, జిల్లాల బాధ్యులు, జాతీయ అవార్డుల సెలెక్షన్ కమిటి సభ్యుడైన సేవా రత్న అవార్డు గ్రహీత, ప్రముఖ ఉద్యమ కారులు చుక్క గంగారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

– బహుజన సాహితీ వేత్తలను గుర్తించడమే మన బి.ఎస్.ఎ. లక్ష్యం

– బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ

సౌత్ ఇండియా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ భారత దేశంలోని బహుజనుల నుండి సాహిత్య పరమైన, సమాజ సేవా పరమైన ఆణిముత్యాలను, త్యాగధనులను వెలికితీసి వారికి తగ్గ గుర్తింపు నిచ్చి అవార్డులతో సత్కరించ డమే మన బహుజన సాహిత్య అకాడమీ సంస్థ లక్ష్యమని వివరించారు.
2017 లో పురుడు పోసుకున్న మన బహుజన సాహిత్య అకాడమీ నేడు జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాలకు, ప్రపంచ స్థాయిలో 8 దేశాలకు విస్తరించిందన్నారు. నేపాల్ లో అంతర్జాతీయ స్థాయి సదస్సు, అవార్డుల ప్రధానోత్సవ సభ జరిగిందన్నారు.
త్వరలో మలేషియాలో కూడా అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవ సభ జరగనుందని ఆయన పేర్కొన్నారు.

మన భారత దేశంలోని వివిధ ముఖ్యమైన నగరాలలో ఇప్పటి వరకు జరిగిన ఈ18 కాన్ఫరెన్స్ ల ద్వారా జాతీయ స్థాయిలో వేలాది మంది సాహితీ వేత్తలకు, కవులు – కళాకారులకు, ఉద్యమ కారులకు, సమాజ సేవకులకు, త్యాగ ధనులకు ఆణిముత్యాలుగా గుర్తించి అవార్డులు అందజేయడం జరిగిందన్నారు.
అవార్డుల ప్రాధాన్యత, వాటి గొప్ప తనం గూర్చి తనదైన శైలిలో “పాట – మాట” రూపంలో కండ్లకు కట్టినట్లు వివరించి సభికులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
మన దేశ మహానీయుల గూర్చి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సాహితీ వేత్తల గురించి, ప్రముఖుల గూర్చి, జాతి రత్నాలైన మన దేశ మహానీయుల గూర్చి, వారి సేవల గూర్చి చాలా చక్కగా వివరించారు.
వారి గొప్ప తనాలను ముందు తరాలకు చాటి చెప్పేందుకే అలాంటి మహానీయుల పేరిట మన “బహుజన సాహిత్య అకాడమీ” ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందజేయడం జరుగుతోందని సూచించారు.
గతంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ సభలకు ప్రజా యుద్ధ నౌక గద్దర్, జయరాజ్, విమలక్క, మిట్టపల్లి సురేందర్, పాటమ్మ రాంబాబు లాంటి తదితర గొప్ప సాహితీ వేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని తెలుపుతూ వారి – వారి గొప్ప తనాల గూర్చి కూడా సభికులకు వివరించారు.
నేడు మన తెలంగాణ ఉద్యమ కళాకారులైన సాహితీ వేత్త డాక్టర్ దరువు ఎల్లన్న ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని తెలుపుతూ దరువు ఎల్లన్న గొప్ప తనాన్ని, ఆయన ఉద్యమ సేవలను, జైలు జీవితాన్ని, కలలను, ఆయన రచనలను, పాటలను సభికులకు నల్లా రాధాకృష్ణ సవివరంగా తెలియజేశారు.

తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవి

– సౌత్ ఇండియా సభలో చాటి చెప్పిన డా.దరువు ఎల్లన్న

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణ ఉద్యమ కళాకారులు డాక్టర్ దరువు ఎల్లన్న మాట్లాడుతూ మా
తెలంగాణ అమర వీరుల త్యాగాలు ప్రపంచానికే గొప్పవని సౌత్ ఇండియా సభలో చాటి చెప్పారు. “వీరులారా వందనం – విద్యార్థి అమరులారా వందనం” పాటను ఆలపించారు.
తెలంగాణ ఉద్యమ తీరును, తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను, తెలంగాణ కలలను, కవులు – కళాకారుల, విద్యార్థుల, ఉద్యమ కారుల పోరాటాలను, తెలంగాణ సంస్కృతిని వివరిస్తూ తనదైన శైలిలో ఉద్యమ గీతాలను ఆలపించి సభికులను ఆశ్చర్యశకితులను చేశారు. వివిధ రాష్ట్రాల నుండి సౌత్ ఇండియా స్థాయిలో ఇట్టి సదస్సుకు హాజరైన ప్రముఖులు, అవార్డ్ గ్రహీతలు, సభికులకు బాహుజనుల గురించి, ప్రభుత్వాల బాధ్యతల గురించి చాలా చక్కగా వివరించారు. బహుజన సాహిత్య అకాడమీ ద్వారా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా ఈ సభ్య సమాజానికి ఉపయోగ పడేలా మీ సేవలను, కలలను, సాహిత్యాలను ప్రదర్శించాలని కోరారు. బహుజన సాహిత్య అకాడమీ సంస్థ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి నేడు ఎదిగిందని, ఈ సంస్థ వ్యవస్థాపకులైన నల్లా రాధాకృష్ణ సేవలు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ కళలను గొప్ప కలలుగా, మన సాహిత్యం గొప్ప సాహిత్యంగా చాటిచెప్పడం ఎంతో గర్వంగా ఉందని దరువు ఎల్లన్న పేర్కొన్నారు.

ఇంత గొప్పగా ప్రపంచ స్థాయికి ఎదిగి మన దేశ ఔన్నత్యాన్ని, మన కలలను, సాహిత్యాలను గుర్తించి అవార్డులు అందజేసి యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న ఘనత కేవలం బహుజన సాహిత్య అకాడమీ కే దక్కిందని సభకు హాజరైన వక్తలు, ప్రముఖులు కొనియాడారు.
మన దేశ ప్రభుత్వం ఈ బహుజన సాహిత్య అకాడమీని గుర్తించి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ కు “భారత రత్న అవార్డు” ప్రకటించాలని ఈ సభలో ముక్త కంఠంతో కోరుతూ సభా తీర్మానంగా ప్రకటించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.