కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అందించాలి
.శ్రీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు…
ఆర్యా!
విషయం: రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన కోవిడ్ టీకా ఉచితంగా ఇవ్వాలని …….
కోటి మంది ప్రజలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలవడాన్ని యావత్ దేశ ప్రజలు హర్షించారు. అలాగే ప్రజారోగ్య వేదిక కూడా అభినందిస్తున్నది.
నేడు కరోనా విపత్తు నుండి ప్రజలు తమ ప్రాణ రక్షణకై వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారుు. ఎందుకంటే ఇంత వరకు కోవిడ్ నివారణకు మందులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితులలో వ్యాక్సిన్ మూడవదశ క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతుల కోసం సిఫార్సు చేసుకుని ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీనికి తగినట్లుగా మార్గదర్శకాలను, ప్రణాళికలను మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటులో నిమగ్నమై ఉందని తెలుస్తున్నది.
ఇప్పటికే కేరళ, తమిళనాాడు, మధ్యప్రదేశ్ మరియు బీహారు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తామని బహిరంగ ప్రకటనలు చేశాయి.
కోవిడ్ మరియు లాక్ డౌన్ అనంతర కాలం లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో ప్రజలు కోవిడ్ టీకానీ కొనుక్కొని తీసుకునే పరిస్థితి లేదు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సురక్షితమైన టీకాను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ఈ మొత్తం నిర్వహించే కార్యక్రమం, ఇచ్చే టీకా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఎంతమందికి ఇస్తారు, అలాగే టీకా వివరాలు దాని సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు అంశాలతో కూడిన సమగ్రమైన వివరాల ప్రకటనను ముందుగానే విడుదల చేయాలని కూడా ప్రజారోగ్య వేదిక విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రభుత్వ అజమాయిషీ లోనే జరగాలని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులలోని మౌలిక సదుపాయాలను మరియు ప్రైవేటు వైద్య సిబ్బందిని కూడా వినియోగించుకుని ఈ సురక్షిత ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని కోరుతున్నాం.
……. యం.వి.రమణయ్య
( రాష్ట్ర అధ్యక్షులుు)
… కామేశ్వరరావు
( రాష్ట్రర ప్రధాన కార్యదర్శి)