తూర్పుగోదావరిజిల్లా , బండారులంక..
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలలో అవగాహన కల్పించడంలో భాగంగా అమలాపురం మండలం బండారులంక సెంటర్ నందు రూరల్ ఎస్సై రాజేష్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కరోనా విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.జనాలు రద్దీగా గుమిగూడరాదని తెలిపారు. మాస్కులు లేకుంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.మాస్కులు తప్పక ధరించాలని,సానిటైజర్ వాడాలని,భౌతిక దూరం తప్పక పాటించాలని రూరల్ ఎస్సై రాజేష్ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు.