Wednesday, 25 February 2026
  • Home  
  • కమ్మ కులం ప్రస్తావనపై తీవ్ర అభ్యంతరం – తెలుగు మహిళ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ స్పందన
- ఖమ్మం

కమ్మ కులం ప్రస్తావనపై తీవ్ర అభ్యంతరం – తెలుగు మహిళ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ స్పందన

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) కమ్మ కులం ప్రస్తావన తీసుకువచ్చిన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘుపై తెలుగు మహిళ తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో కుల ప్రస్తావనలు చేయడం సరికాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని ఝాన్సీ పేర్కొన్నారు. ఆ సమయంలో మంత్రి గా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ద్వారా అనేకమంది పేదలకు హౌస్ ప్లాట్లు మంజూరు చేయడం, గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. 1990లలో ఖమ్మం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయి. ఆ విషయాలు తెలియకపోయినా సరే, కులాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం సమంజసం కాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోందని, జర్నలిస్టులు సమాజంలో విభేదాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆమె హెచ్చరించారు. కమ్మ సమాజం కష్టపడే స్వభావం కలిగి ఉందని, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే తమ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. కులం ఆధారంగా వ్యక్తులపై వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో అనవసర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు చేయవచ్చుగానీ, వాటిని కుల రంగు పూయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చలాసాని ఝాన్సీ స్పష్టం చేశారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

కమ్మ కులం ప్రస్తావన తీసుకువచ్చిన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘుపై తెలుగు మహిళ తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు చలాసాని ఝాన్సీ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో కుల ప్రస్తావనలు చేయడం సరికాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని ఝాన్సీ పేర్కొన్నారు. ఆ సమయంలో మంత్రి గా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ద్వారా అనేకమంది పేదలకు హౌస్ ప్లాట్లు మంజూరు చేయడం, గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు.

1990లలో ఖమ్మం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయి. ఆ విషయాలు తెలియకపోయినా సరే, కులాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం సమంజసం కాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోందని, జర్నలిస్టులు సమాజంలో విభేదాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆమె హెచ్చరించారు.

కమ్మ సమాజం కష్టపడే స్వభావం కలిగి ఉందని, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే తమ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. కులం ఆధారంగా వ్యక్తులపై వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో అనవసర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ విమర్శలు చేయవచ్చుగానీ, వాటిని కుల రంగు పూయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చలాసాని ఝాన్సీ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.