చిట్వేల్, అక్టోబర్ 3: (మీ స్పందన)
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండల పరిధిలోని పెద్దఓరంపాడు గ్రామ పంచాయతీ పాపిరెడ్డి పల్లె సమీపంలోని అప్పారావు సర్కిల్, కాశీనగరం జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.చిట్వేలి మండలానికి చెందిన కడు పేదరికంలో జీవిస్తున్న, రెండు చేతులు లేని దివ్యాంగులు మల్లికా, కార్తీక్ లకు స్వయంగా జీవనజ్యోతి జీవన పెన్షన్ అందజేసి నిరుపేదలకు అండగా నిలిచారు.ఈ సందర్భంలో పలు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ “ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అన్నదానం చేయడమే కాకుండా, మీ స్వంత సొమ్ముతో దివ్యాంగులకు పెన్షన్ అందించడం చూస్తే మీరు దేవుడి రూపంలో మా కోసం పుట్టిన వాడివని అనిపిస్తుంది. ఇంతటి మానవతా దృక్పథం అందరికీ ఆదర్శం”అని ప్రశంసించారు.
కార్యక్రమంలో జీవనజ్యోతి ఆనంద నిలయం వర్కింగ్ మేనేజర్ దట్టం రఘురామయ్య, కోవూరి సావిత్రి (తిరుపతి), కోవూరి జయలక్ష్మి / లక్ష్మీదేవి (కడప), పాపిరెడ్డి పల్లి పెద్దలు జెట్టి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాణ్యం లోకేష్ బాబు, పెయిలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ “కడుపేదరికంతో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసే వరకు జీవనజ్యోతి జీవన పెన్షన్ అందించడం నా ధర్మం, నా కర్తవ్యం. దేవుడు ఇచ్చిన వరమిదే. మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో నేను ఎల్లప్పుడూ అర్హులైన నిరుపేదలకు అండగా ఉంటాను. అర్హులైన వారు ఆశ్రమాన్ని సంప్రదించి జీవన పెన్షన్ పొందవచ్చు” అని తెలిపారు.ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, సేవలో దైవస్వరూపంగా నిలుస్తున్న సుబ్రహ్మణ్యం స్వామి పట్ల గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


