విశాఖపట్నం, గాజువాక మార్చి (పున్నమి ప్రతినిధి)
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో మోసం చేసిన ఘటన గాజువాకలో వెలుగుచూసింది. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అప్పారావు కస్టమర్ల ఓటీపీలు సేకరించి సుమారు 30 గ్యాస్ సిలిండర్లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మణికంఠ ఏజెన్సీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడు కస్టమర్లతో వరుసలు కలిపి ఓటీపీలు తీసుకొని సిలిండర్లను సరఫరా చేయకుండా మళ్లించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అప్పారావును అరెస్ట్ చేసినట్లు గాజువాక ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ పార్థసారథి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవనున్నాయి.
Uploaded Video:


