*ఐటీ విశ్వనగరంగా విశాఖ*- *విశాఖకు క్యూ కడుతున్న మరిన్ని ఐటి కంపెనీలు* – *కొల్లు రవీంద్ర* ( ఎక్సైజ్ మంత్రివర్యులు )
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
గాజువాక తెలుగుయువత ఆధ్వర్యంలో విద్యార్ధులకు గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం చారిత్రాత్మకం పై అవగాహన కార్యక్రమం గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు గారు, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు గారు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా *కొల్లు రవీంద్ర* గారు మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు తెచ్చిన ఘనత చంద్రబాబు, లోకేష్ లదే అని యువతకు 1.88 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఇకనుండి రాష్ట్రంలో ఉండే యువత వేరే రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్ళనవసరం లేదని, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని తెలిపారు. విద్యావంతులైన యువకులు దీనిని అర్థం చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి మీ సహకారాలు ఎంతో అవసరమని తెలిపారు.
మరొక ముఖ్య అతిథి గాజువాక MLA *పల్లా శ్రీనివాసరావు* గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి కృషితో, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఐటీలో విశాఖను విశ్వనగరంగా మారబోతోందని, 30 ఏళ్లలో హైదరాబాద్ ఐటీ సాధించిన అభివృద్ధిని విశాఖ 10 ఏళ్లలోనే అందుకోబోతోందని కొనియాడారు
టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. సిఫీ.. వంటి ఐటీ కంపెనీలను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు గారు.. లోకేష్ గారికే దక్కుతుంది. రాబోయే 20 ఏళ్లలో విశాఖను ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రీజియన్ గా చేయాలని వీరిద్దరూ కృత నిశ్చయంతో ఉన్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్,ఏపీ గ్రీనింగ్ ఎండ్ బ్యూటీఫికేషన్స్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు, గాజువాక కూటమి కార్పొరేటర్లు బోండా జగన్, రౌతు శ్రీనివాస్, లేళ్ళ కోటేశ్వరరావు, బొడ్డు నరసింహ పాత్రుడు, కూటమి సీనియర్ నాయకులు, తెలుగుయువత అధ్యక్షులు మానపురం గణపతి,ప్రధాన కార్యదర్శి వియ్యపు నరేష్, భార్గవ్, అప్పలరాజు, సాయి, టేకేటి అప్పలరాజు, సుధీర్ రెడ్డి, దాసరి గణేష్, గంతకోరు శీను, కాలేజీ విద్యార్థులు, తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


