ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సంగరాజు బాలరాజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా,స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొని, డాక్టర్ బాలరాజును శాలువాతో సత్కరించి, స్వామివారి పవిత్ర వస్త్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సేవల విస్తరణలో ఐఎంఏ కీలక పాత్ర పోషిస్తుందని, కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు,బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ బాలరాజును సత్కరించిన శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు