ఏరుగట్ల డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం చేస్తా…!
బిజెపి ప్రతినిధులకు బాధితులకు హామీ ఇచ్చిన ఖమ్మం జిల్లా #Collector గారు..
సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామంలో జరుగుతున్న డబల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురుశెట్టి గారికి మరియు జాయింట్ కలెక్టర్ పీ.శ్రీనివాస రెడ్డి గారికి ఏరు గట్ల బాధితులను తీసుకొని వెళ్లి సమస్యను వివరించి ఫిర్యాదులు అందజేసిన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు Nelluri Koteswara Rao గారు.
మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు .. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే డబల్ బెడ్రూమ్స్ కోసం స్థలాలను ఇచ్చారో ఆ 15 మందికి మొదటి ప్రాధాన్యతగా డబల్ బెడ్రూమ్స్ కేటాయిస్తామని మిగిలిన ఇళ్లు కూడా అర్హులకే అందజేస్తామని జిల్లాలో ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లయితే, రద్దుచేసి
అర్హులకు కేటాయిస్తానని హామీ కలెక్టర్ గారు ఇచ్చారు.అలాగే ఏరుగట్ల గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.!!
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరీ కోటేశ్వరావు, రాష్ట్ర నాయకులు ఈవి రమేశ్, నంబూరీ,రామలింగేశ్వర రావు పెరమళ్ళ విజయరాజు. జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా, భాస్కర్ ని వీరమ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పడిగల మధుసూదన్ రావు పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు మట్ట ప్రసాద్ పర్షా రాంబాబు,చింతనొప్పు రామారావు మరియు ఏరుగట్ల బాధితులు అందరు పాల్గొన్నారు


