40 మంది శ్రీ చండీ ఉపాసకులచే శ్రీ శత చండి మహా యాగ కార్యక్రమం
భక్తులందరికీ ఆహ్వానం
ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ
పున్నమి ప్రతినిధి ,రామచంద్రాపురం
రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ చాయా పురంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ మహా మండలేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా ఈనెల 14 ,15, 16వ తేదీ లలో మూడు రోజులపాటు శ్రీ శతచండీ మహాయాగం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యంశర్మ తెలియజేశారు. మూడు రోజులపాటు జరిగే శ్రీ శత చండీ మహాయాగంలో భాగంగా మొదటి రోజు గణపతి హోమం, గోపూజ, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం ప్రత్యేక పూజలు. ముఖ్యంగా ప్రముఖ శివ క్షేత్రాలు కాశి, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి 40 మంది శ్రీ చండి మాత ఉపాసకులచే శ్రీ శత చండి మహా యాగం అత్యంత వైభవంగా, ఆగమశాస్త్రం ప్రకారం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారి మహా యాగంలో పాల్గొని, ఆరోగ్యం ,ఐశ్వర్యం ,విజయం వారి కుటుంబాలకు కలిగేలా పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మహా యాగంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ శత చండీ కరపత్రాలను శిష్య బృందంతో కలిసి ఉంగరాల శ్రీ సుబ్రహ్మణ్య శర్మ దంపతులు ఆవిష్కరించారు. మహా యాగానికి విచ్చేసే భక్తులందరికీ నిరంతర అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు

